*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
'వైష్ణవి' నిందితుల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి నాగ వైష్ణవి దారుణ హత్య కేసులో నిందితులను ఆమె అన్న సాయి తేజ గుర్తించాడు. సాయితేజను పోలీసులు శనివారం మధ్యాహ్నం సబ్ జైలుకు తీసుకువచ్చి న్యాయమూర్తి సమక్షంలో హంతకుల గుర్తింపు పరేడ్ నిర్వహించారు. సంఘటన జరిగిన రోజున తాను తన చెల్లి నాగ వైష్ణవి కారులో స్కూలుకు వెళుతుండగా తమను అటకాయించి, వైష్ణవిని అపహరించుకుపోయిన శ్రీనివాస్, జగదీష్ లను సాయితేజ గుర్తించాడు. అయితే, వైష్ణవి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న వెంకట్రావు గౌడ్ ను కూడా అరెస్ట్ చేసి త్వరలోనే కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుల గుర్తింపు సందర్భంగా మీడియాను సబ్ జైలు లోపలికి అనుమతించలేదు.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting