|
|
| | |
|
విశాఖలో ఇద్దరి కిడ్నాప్
జిల్లాలో మావోయిస్టులు మళ్లీ తెగబడ్డారు. కొయ్యూరు మండలాధ్యక్షుడుతో పాటు మరో వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆదివారం ఉదయం దాదాపు పదిమంది మావోయిస్టులు కలసి ఈ అపహరణ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికుల చెబుతున్నారు. జిల్లాలోని కొయ్యూరు మండల అధ్యక్షుడు కోనేరు సోమయ్య, అతని సహచరుడు బాలయ్యలు కలసి ఉండగా మావోలు ఒక్కసారి దాడి చేసి వారిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
|
|
|