*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
తిరుపతిలో తల్లిబిడ్డల ఆత్మహత్య
తిరుమలలో తల్లిబిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. సస్తగిరి అతిథి గృహంలోని 376 గదిలో బస చేసిన వారిలో తల్లి ఓ బిడ్డ విగతజీవులుగా పడి ఉన్నారు. వీరిని తిరువళ్లూరు సమీపంలోని అంబత్తూరుకు చెందిన కృష్ణవేణి, సుగావాణలుగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఉదయం క్రిమి సంహారక మందు తాగి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఇద్దరి పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా భర్త అచూకీ తెలియడం లేదు.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting