*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
హైదరాబాద్ సిపిగా ఎ.కె ఖాన్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఎ.కె.ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ నగర కమిషనర్ గా ఉన్న బి. ప్రసాదరావును ఆర్టీసీ ఎండిగా బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండిగా ఉన్న మాజీ డిజిపి ఎస్సెస్పీ యాదవ్ ను గోదావరి వ్యాలీ అథారిటీ చైర్మన్ గా బదిలీ చేస్తూ మరోసారి ఇరకాటంలో పెట్టింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఎకె ఖాన్ ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న శాంతి భద్రతల అదనపు డిజి పదవీ బాధ్యతలను రతన్ కు అప్పగించింది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ డిసిపిగా రవివర్మను, హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపిగా స్టీఫెన్ రవీంద్రను, ఈస్ట్ జోన్ డిసిపిగా మహేష్ చంద్ర లడ్హాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఎం.కె. సింగ్ ను నియమించింది. రైల్వే డిఐజిగా సౌమ్యా మిశ్రాను పంపించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా ఉంటూ లగడపాటి దీక్షా సమయంలో సస్పెన్షన్ కు గురైన రాజేంద్రనాథ్ రెడ్డిని అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting