*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
'ఆ తీవ్రవాదులు ఇండియన్సే'- కసబ్
పొంతన లేని ప్రకటనలతో పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న పాకిస్థాన్ తీవ్రవాది కసబ్ తాజాగా మరో బాంబు పేల్చాడు. ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన దాడిలోపాల్గొన్న నలుగురు తీవ్రవాదులు భారతీయులేనని చెప్పాడు. సోమవారం కసబ్ ను ప్రత్యేక న్యాయమూర్తి ఎం ఎల్ తహలయాని విచారించగా ఈ వ్యాఖ్యలు చేసాడు. 26/11 ఘటనలో పాల్గొన్న తీవ్రవాదులు నలుగురు భారతీయులేనని, వారిలో ఒకరు కాశ్మీరుకి చెందిన వాడు కాగా, మరొకరు గుజరాత్ కి చెందిన వాడని పేర్కొన్నాడు. మూడోవాడిని గుర్గావ్ చౌపతీ వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేసారని, నాలుగో వ్యక్తి తనకు తెలియదని, తానెప్పుడూ చూడనేలేదని విచారణలో కసబ్ వెల్లడించాడు. అయితే కేసును నీరుగార్చేందుకే కసబ్ విచారణలో విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అభిప్రాయపడ్డారు.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting